నాయుడుపేటలో శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 260 మంది హెచ్సి/పీసీలతో సహా మొత్తం 300 మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దర్శనం సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.