ఆర్ అండ్ బి రోడ్డుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. మున్సిపల్ కార్మికులకు అదనపు భారం

సూళ్లూరుపేట పట్టణంలో, అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ఆర్ అండ్ బి రోడ్డుపై ప్రైవేటు కాంట్రాక్టర్ ఇసుక, సిమెంట్, కాంక్రీట్ నిల్వ చేసి, రోడ్డును ధ్వంసం చేశారని, అయితే ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ ఆరోపించారు. పని పూర్తయ్యాక మిగిలిన సామగ్రిని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిన కాంట్రాక్టర్ వల్ల, మున్సిపల్ కార్మికులు అదనపు భారంతో రోడ్డును శుభ్రం చేయాల్సి వస్తోందని, ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్