సూళ్లూరుపేట ఇరకం గ్రామo నందు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీతో కలిసి అక్కడి ప్రజలతో గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం పులికాట్ సరస్సులో ఉన్నటువంటి ఇరకం దీవికి ఎంతో ప్రత్యేకత ఉందని, టూరిజంకి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి దీవి అని అన్నారు.