బి. కొత్తకోట టౌన్ రంగసముద్రం రోడ్డు గల ఆదిత్య డిగ్రీ కళాశాలలో గురువారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు నుండి విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీడీవో కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 284 మంది పాల్గొనగా 112 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు.