తంబళ్లపల్లి మండలంలో ఆసాంఘిక కార్యకలాపాలు జరగనివ్వబోమని సబ్ ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం తంబళ్లపల్లిలో పర్యటించిన ఆయన, బ్యాంకులు, ఏటీఎంలను తనిఖీ చేసి భద్రతా సూచనలు అందించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.