తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవిమనోహరచారి ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ యాజమాన్యానికి తిరుపతిలోని రామతులసి కళ్యాణమండపంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. స్కూల్ భద్రతకూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు, అనుభవజ్ఞులైన గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనర్లు రాజకీయ సభలకు వెళ్ళకూడదని, డ్రైవర్లకు లైసెన్స్, బస్సులకు ఫిట్ నెస్ తప్పనిసరి అని తెలిపారు.