తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీగా గీతాకుమారి మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె జిల్లా ఎస్పీ సుబ్బారాయుడును కలిసి బాధ్యతలపై చర్చించారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. గీతాకుమారి ఇంతకుముందు గూడూరు డీఎస్పీగా సేవలందించారు.