తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ విచారణలో బయటపడింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్ట్‌తో పలు సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. విచారణ వేగం పెంచిన సిట్, నెయ్యి సరఫరా ఒప్పందాలపై దృష్టి సారించింది.