ఏపీఎస్పీడీసీఎల్‌లో పదవీ విరమణ పొందిన చీఫ్ జనరల్ మేనేజర్ కృష్ణారెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ హనుమేష్‌రావులకు కార్పొరేట్ కార్యాలయంలో ఘన సన్మానం జరిగింది. వారి సేవలు అమూల్యమని సిఎండి శివశంకర్ లోతేటి ప్రశంసించారు. మాజీ సీఎండీలు, డైరెక్టర్లు కూడా వారి సేవలను కొనియాడారు. అనంతరం పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.