సత్యవేడు: సర్వేయర్ సునీత కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేత

నాగలాపురం మండల సర్వేయర్ సునీత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ జి ఎస్ పి శాలరీ ప్యాకేజీ ద్వారా రూ. కోటి ప్రమాద మరణ బీమా చెక్కును కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం అందజేశారు. సునీతకు ఎస్ బిఐ పద్మావతిపురం శాఖలో ఎస్ జిఎస్ పి జీతం ఖాతా ఉండటంతో ఈ బీమా సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా కలెక్టర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ బిఐ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్