తిరుపతి జిల్లాలో నెలరోజుల పాటు సెక్షన్-30 అమలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీసు శాఖ సెక్షన్-30ను అమలు చేయనుంది. తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలనుకునే వారు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి. వివాహాలు, కుటుంబ, వ్యక్తిగత వేడుకలకు ఈ నిబంధనలు వర్తించవు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్