తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో పాముల కలకలం.. ప్రయాణికుల్లో ఆందోళన

తిరుపతి విమానాశ్రయం ప్రాంగణంలో పాములు సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్కింగ్ ప్రాంతాలు, నడక మార్గాల్లో తరచుగా పాములు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో వాహనాల టైర్ల వద్ద, ఇంజిన్ భాగాల దగ్గర పాములు చేరుతున్నాయని డ్రైవర్లు తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో పొదలు, చెత్త తొలగించకపోవడమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. అధికారులు వెంటనే పాముల నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్