తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'డయల్ యువర్ కమిషనర్' కార్యక్రమంలో మొత్తం 43 ప్రజా వినతులు వచ్చాయి అని కమిషనర్ మౌర్య తెలిపారు. వీటిలో 15 మంది ఫోన్ ద్వారా, 28 మంది వ్యక్తిగతంగా వచ్చి తమ సమస్యలు వివరించారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.