నిధుల లేమితో తిరుపతి కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి బ్రేక్

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. రూ. 94కోట్ల అంచనాతో 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రూ. 52కోట్ల పనులు పూర్తయ్యాయి. అయితే, మునిసిపల్ అథారిటీ నుంచి కేవలం రూ. 17కోట్లే విడుదల కావడంతో కాంట్రాక్టర్ ఆరు నెలల క్రితమే పనులు నిలిపివేశారు. సమస్యను అధికారులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో భవన నిర్మాణ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

సంబంధిత పోస్ట్