తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేయనున్న ఈట్ స్ట్రీట్‌కు సంబంధించిన లక్కీ డిప్ బుధవారం కచ్చాపి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. భారత ప్రభుత్వ నిధులతో 14 షాపులు ఏర్పాటు చేయగా, వాటి నిర్వహణకు ఐదు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండటంతో లక్కీ డిప్ వేదికను ఆడిటోరియంకు మార్చినట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 11 గంటలకు లక్కీ డిప్ నిర్వహించనున్నట్లు, దరఖాస్తుదారులు హాజరై సహకరించాలని సూచించారు.