తిరుపతి: రిటైర్మెంట్‌కు ముందురోజే ప్రమోషన్.. ఎస్పీ హోదా

తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారికి రిటైర్మెంట్‌కు ముందురోజే ఎస్పీ (నాన్ కేడర్) హోదా కల్పించారు. 1989లో పోలీసు శాఖలో చేరిన ఆమె, 2018లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. టీటీడీ విజిలెన్స్‌లో పనిచేసిన ఆమె, ఏఎస్పీగా శ్రీసిటీ, వైజాగ్, తిరుపతి ప్రాంతాల్లో సేవలందించారు. మంగళవారం ఏసీబీ జేడీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, సాయంత్రం అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్