తిరుపతి: భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీబీసీ ప్రసారాలు

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను మరింత విస్తరించి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంచేందుకు టీటీడీ చర్యలు తీసుకోనుంది. టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) ఇంఛార్జి సీఈవో డా. ఎ. శరత్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం వివిధ శాఖల ప్రతినిధులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోజువారీ కార్యక్రమాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్