రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఐదు పేద కుటుంబాలను శుక్రవారం దత్తత తీసుకున్నారు. కలెక్టరేట్ సమీపంలోని నక్కల కాలనీకి చెందిన సావిత్రమ్మ, వేదవల్లి, అంబికా, బలరాం కుటుంబాలతో పాటు దామినేడు గ్రామానికి చెందిన విజయశాంతి కుటుంబాన్ని ఎంపిక చేశారు. ఈ కుటుంబాలకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, నివాసం తదితర మౌలిక సదుపాయాలను కల్పించి జీవనోపాధిని మెరుగుపరచనున్నారు.