తిరుపతి: టీటీడీకి అశోక్ లేలాండ్ నుంచి ట్రక్కు విరాళం

ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రూ. 31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఈ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్, టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్‌ఛార్జ్ జీఎం లక్ష్మీప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్