శనివారం, టీటీడీ ఆరోగ్యం, విద్య విభాగాల జేఈఓ డా. శరత్, సంబంధిత అధికారులతో శ్రీవారి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆసుపత్రుల్లో నిపుణుల కొరతపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అలాగే, శ్రీవారి వైద్య సేవ కోసం అభివృద్ధి చేసిన యాప్‌లో అవసరమైతే మార్పులు చేయాలని జీఎం ఐటీ ఫణికుమార్ నాయుడును సూచించారు.