తిరుమలలో టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం రాంభగీచా-1 గెస్ట్ హౌస్‌లోని గది నెం. 134లో బస చేసిన విజయనగరం జిల్లాకు చెందిన మాలేడా బ్రహ్మం పొరపాటుగా సుమారు నాలుగు తులాల బంగారు గొలుసు, డాలర్ ను గదిలో మర్చిపోయారు. వాటిని గుర్తించిన టీటీడీ సిబ్బంది వెంటనే సెక్యూరిటీ సమక్షంలో మాలేడా బ్రహ్మంకు అప్పగించారు. వారి విధిపరమైన నిబద్ధతపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.