తిరుపతి నగరంలోని గాంధీరోడ్డులో గల హథీరాంజీ మఠంలో దుకాణాలు నిర్వహిస్తున్న ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అన్నారు. పురాతనమైన హథీరాంజీ భవనం కూల్చడంపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, దుకాణదారులతో కమిషనర్ సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. ఎక్కడైతే కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ మరమ్మత్తులు చేయించాలని కోరారు.