తిరుమలలో టాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

తిరుమల ట్రాఫిక్ పోలీసులు టాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, నిర్ణీత ఛార్జీలకే సేవలు అందించాలని సూచించారు. వాహనాలకు ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైట్లు అమర్చరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 75 వాహనాలకు రూ. 75 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి రూ. 1 లక్ష జరిమానా విధించామని, భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్