తిరుమలలోని పలు పెట్రోల్ బంకుల్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హెచ్ పీ పెట్రోల్ బంకులో 1000లీటర్ల పెట్రోల్, 3000లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని, సాయంత్రానికి మరింత ఇంధనం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం బైకులకు 1లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు 5లీటర్ల చొప్పున ఇంధనం సరఫరా చేస్తున్నారు.