తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నప్పటికీ, మూడు జోన్లు, ఏడు వార్డులుగా విభజించి పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 9 టిప్పర్ వాహనాలతో నిత్యం చెత్త సేకరణ జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం 354 టాయిలెట్ బ్లాకులు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. నీరు, ఆహార నాణ్యతను ఆధునిక ల్యాబ్‌లలో పరీక్షించి, భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు.