వాహన పన్ను గడువు పొడిగింపు: జరిమానా తప్పించుకోండి!

తిరుపతి జిల్లాలో క్యాబ్‌లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్ల త్రైమాసిక పన్నును ఈ నెల 31లోపు పెనాల్టీ లేకుండా చెల్లించాలని ఆర్టీఏ అధికారి కొర్రపాటి మురళీమోహన్ సూచించారు. గడువు దాటితే మేలో 100%, జూన్‌లో 200% జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బకాయి పన్నులు, ఫైన్‌లు వెంటనే చెల్లించాలని, లేకపోతే వాహనాల స్వాధీనం జరుగుతుందని తెలిపారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పీయూసీ పత్రాలు చెల్లుబాటులో ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్