భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ ఆదేశాలు

తిరుపతి జిల్లా, డక్కిలి మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రైతులు, పశువుల కాపరులు అత్యంత జాగ్రత్త వహించాలని, కాలువలు, విద్యుత్ తీగలు, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే 100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ సిబ్బంది పొంగే కాలవల వద్ద ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్