వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానిపై వచ్చిన అభియోగాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ముగ్గురు సభ్యుల బృందం ఆస్పత్రిలో విచారణ ప్రారంభించింది. సిబ్బంది ఫిర్యాదుల ఆధారంగా సుదీర్ఘ దర్యాప్తుతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నట్లు విచారణ బృందం తెలిపింది.