AP: విశాఖలో నేటి నుంచి రెండు రోజుల పాటు CII పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సమావేశాలు, ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సదస్సు సందర్భంగా 19 ప్లీనరీలు, వ్యాపార సమావేశాలు జరగనున్నాయి.