నేడు సాగునీటి సంఘాల అధ్యక్షులతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ

AP: అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రాయపూడి పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఈ భేటీ జరగనుంది. ఇరిగేషన్ వ్యవస్థలోని లోటుపాట్లు, రూ.18 వేల కోట్ల బిల్లుల బకాయిల చెల్లింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించనున్నారు. అలాగే నీటి భద్రత, సమర్థవంతమైన వాటర్ మేనేజ్‌మెంట్, భూగర్భజలాల పెంపు అంశాలపై సాగునీటి సంఘాలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్