సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ.. వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టులు, ఐటీ కంపెనీల భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ పరిధిలోని అభివృద్ధి పనులు, రాయపూర్-విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంత రోడ్లు, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్