AP: విజయవాడలో జరుగుతున్న పాన్‌ఐఐటీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కొత్త టెక్నాలజీలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. స్టార్టప్‌లు, ఐఐటీయన్ల ఆవిష్కరణలను పరిశీలించారు. పెట్రోల్ ద్విచక్ర వాహనాలను కొన్ని గంటల్లోనే ఈవీలుగా మార్చే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముఖాన్ని స్కాన్ చేసి నిమిషాల్లో ఆరోగ్య నివేదిక అందించే యాప్ గురించి సీఎం అడిగారు.