AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును 'విజన్ యూనిట్లు'గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ సాధన లక్ష్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాలు 'విజన్ యూనిట్లు'గా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని పేర్కొంది. కానీ వాటి పేరును మార్చలేదని సీఎంవో స్పష్టం చేసింది. ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని పేర్కొంది.