AP: ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ. 85 కోట్ల భారం పడనుంది. మగ్గానికి 200 యూనిట్ల వరకు, మర మగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నారు. దీని వల్ల 93 వేల కుటుంబాలు, 10,534 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ పథకంతో చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆర్థికంగా ఊరట లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు.