ఈ నెల నుంచి కరెంట్ బిల్స్ తగ్గుతాయి: మంత్రి గొట్టిపాటి

AP: ఈ నెల నుంచి విద్యుత్తు బిల్లులు తగ్గనున్నాయని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఎఫ్‌పీపీపీ ఛార్జీల రూపంలో 40 పైసలు అధికంగా వసూలు చేశారని, ఇప్పుడు వాటిని 13 పైసల వరకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని అన్నారు. అనకాపల్లి జిల్లా చౌడువాడ, కింతలిలో కొత్త విద్యుత్‌ ఉపకేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 ఉపకేంద్రాలు నిర్మిస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్