AP: శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ ముప్పు నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు వివిధ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, తీర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.