మొంథా తుఫాన్.. అత్యవసర నిధులు విడుదల

AP: మొంథా తుఫాన్‌పై జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ మేరకు అత్యవసర నిధులను విడుదల చేశారు. 26 జిల్లాలకు మొత్తం రూ.19 కోట్లు మంజూరు చేశారు. 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున, మిగతా 13 జిల్లాలకు రూ.50 లక్షల చొప్పున విడుదల చేశారు. తుఫాన్ తీవ్ర ప్రభావిత జిల్లాలకు అవసరమైతే అదనంగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్