మురసు తుఫాన్ వల్ల రూ.2,484.43 కోట్ల నష్టం

AP: విపత్తు నిర్వహణ కార్యాలయంలో 'మురసు' తుఫాన్ వల్ల జరిగిన నష్టాలను కేంద్ర బృందం సమీక్షించింది. ఈ బృందం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను అభినందించింది. ఈ తుఫాన్ వల్ల మొత్తం రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕