24,057 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ.. డేట్ ఫిక్స్

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. విజయవాడలో ఈ నెల 30న సీఎం చంద్రబాబు 24,057 మందికి ఇళ్ల రెగ్యులరైజేషన్ పట్టాలు అందిస్తారని ప్రభుత్వం తెలిపింది. 616 ఎకరాల్లోని ఆ స్థలాల మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు అని వెల్లడించింది. దశాబ్దాల క్రితం ఇచ్చిన పట్టాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్దీకరణ పట్టాలు అందించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕