ఏపీలో పొరపాటున కూడా ఈ ఇంజెక్షన్ వాడొద్దు

AP: ‘బుపివాకైన్‌’ ఇంజెక్షన్‌ వాడొద్దని ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్స్‌ విభాగం ఆదేశించింది. వెన్నెముకకు ఇచ్చే ఈ మత్తు ఇంజెక్షన్‌ను థెమిస్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనస్థీషియాలజిస్ట్స్‌ (ఐఎస్‌ఏ), అనస్థీషియా పేషెంట్‌ సేఫ్టీ అసోసియేషన్‌ (ఏపీఎస్‌ఏ) ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇంజెక్షన్‌ దుష్ప్రభావాలు చూసినట్లు తేలడంతో రోగుల భద్రత దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దీని సరఫరా, వాడకం నిలిపివేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు కూడా దీని వాడకం నిలిపివేయాలని ఐఎస్‌ఏ అప్రమత్తం చేసింది.

సంబంధిత పోస్ట్