AP: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే అసైన్డ్ భూములను అమ్మడానికి వీలుండదు. ఇవి 22ఏ (నిషేధిత) జాబితాలో ఉంటాయి. అసలైన లబ్ధిదారుకు పూర్తి హక్కులు కల్పిస్తూ 22ఏ లిస్టు నుంచి తొలగించడాన్నే ఫ్రీ హోల్డ్ చేయడం అంటారు. గత ప్రభుత్వం 2023లో అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్కు అవకాశమిచ్చింది, 13 లక్షలకుపైగా ఎకరాలను ఫ్రీ హోల్డ్గా ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న సుమారు 9 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్పై నిషేధాన్ని ఎత్తేయనుంది.