జాబ్ క్యాలెండర్‌ షెడ్యూల్‌పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: APPSC

ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులను తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా ప్రచారాలపై APPSC హెచ్చరిక జారీ చేసింది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక షెడ్యూల్ విడుదల చేయలేదని తెలిపింది. కమిషన్‌కు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు, షెడ్యూళ్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. 91 గ్రూప్-1, 750 గ్రూప్-2, 209 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారం అధికారికం కాదని తెలిపింది.

సంబంధిత పోస్ట్