ప్రయాణికులకు సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ వినూత్న సేవలను ప్రారంభించింది. ఇకపై బస్టాండ్కు వెళ్లే అవసరం లేకుండా, నేరుగా ఇంటి నుంచే బస్సు ఎక్కే వెసులుబాటు కల్పించింది. కనీసం 6 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే ఈ సేవ వర్తిస్తుంది. ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ఈ సేవను ప్రారంభించారు. బస్సు బయల్దేరడానికి 4 గంటల ముందు 73828 25450, 99592 25450 నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.