ఆంధ్ర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందస్తుగా జనవరిలో నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి అంగీకరించింది. పంచాయితీరాజ్ పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయితీల పదవీకాలం మార్చిలోనే ముగియనుండటంతో జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది.