KVPS తూ. గో జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు నిడదవోలు రైల్వే స్టేషన్ ను అమృత భారత రైల్వే స్టేషన్ గా ఎంపిక చేయడాన్ని అభినందించారు. శుక్రవారం నిడదవోలు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల చిరకాల కోరిక అయిన జన్మభూమి LTT ఎక్స్ప్రెస్, కాకినాడ ట్రైన్, నిడదవోలు, నరసాపురం పాసింజర్ ట్రైన్స్ నిలుపుదల పునరుద్ధరణ చేయాలని అధికారులను కోరారు.