అమలాపురం నల్లవంతెన వద్ద శ్రీచైతన్య పాఠశాల బస్సు అత్యవసర ద్వారం ప్రమాదవశాత్తు తెరుచుకున్న ఘటనపై జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు స్పందించారు. రాజమహేంద్రవరం చిరునామాతో రిజిస్ట్రేషన్ అయిన ఈ బస్సు, స్థానిక ఏటీఎస్ సెంటర్‌లో ఫిట్‌నెస్ పొందింది. నిబంధనల ఉల్లంఘనపై స్పందించిన అధికారులు బస్సును సీజ్ చేసి, ఫిట్‌నెస్‌ను రద్దు చేస్తూ సీఎఫ్‌ఎక్స్ నోటీసు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం పాఠశాల యాజమాన్యాన్ని రాజమహేంద్రవరం డీటీఓను సంప్రదించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.