అమలాపురం: మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఉపాధ్యాయులు అత్యంత నిబద్ధతతో, పారదర్శకంగా మార్కులు వేయాలని ఆయన సూచించారు. చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా బోర్డు నిబంధనల ప్రకారం మూల్యాంకనం పూర్తి చేయాలని, విధుల్లో ఉన్న సిబ్బందికి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్