కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుదాన యూనిట్లు నెలకొల్పేందుకు మండలాల వారీగా సంఘాలను ఏర్పాటు చేసి, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం అమలాపురంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఉద్యాన అధికారులుతో సమావేశం నిర్వహించి, కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.