కలెక్టర్ ఆదేశాలు: వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలి

బుధవారం, స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జిల్లా రోడ్డు రవాణా సంస్థ, రావులపాలెం, రామచంద్రపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాల పనితీరుపై సమీక్ష సమావేశం జరిగింది. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ ప్రక్రియలను వేగవంతం చేసి, పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్