అమలాపురంలో కలుషిత నీటి సరఫరా: స్థానికుల ఆందోళన

అమలాపురం పట్టణంలోని రవణం మల్లయ్య వీధిలో కలుషిత తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కుళాయిల నుండి నలుపు రంగులో నీరు వస్తోందని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మురికి నీటిని ఎలా తాగాలని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్